ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10ఏళ్ల చిన్నారి పెద్ద మనసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 23, 2020, 07:58 PM

10ఏళ్ల చిన్నారి ఎంతో అపురూపంగా చూసుకున్న తన జుట్టుని క్యాన్సర్‌ రోగుల కోసం దానం చేసింది. సూరత్‌కు చెందిన దేవ్నా జనార్దన్‌ అనే చిన్నారి తన పొడవాటి జుట్టుని క్యాన్సర్ రోగుల కోసం దానం ఇచ్చి తన పెద్ద మనస్సుని చాటుకుంది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ ప్రస్తుతం దేవ్నా క్యాన్సర్‌ రోగుల కోసం తన జుట్టును దానం చేసింది. ‘నా 32 అంగుళాల పొడవాటి జుట్టును క్యాన్సర్ రోగులకు ఉపయోగపడడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఎంత అపురూపంగా పెంచుకున్న జుట్టుని క్యాన్సర్ రోగుల కోసం దానం చేసానని తెలిపింది. అంతేకాదు ఈ చిన్నారి భవిష్యత్ లో క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలనుకుంటున్నాననీ వారి చికిత్స చేయాలని కోరుకుంటున్నానని తెలిపింది. దేవ్నా జుట్టు ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత చిన్న వయసులో దేవ్నా చూపిన ఔదార్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా గతంలో కూడా క్యాన్సర్ రోగుల కోసం 80మంది కాలేజీ అమ్మాయిలు తమ జుట్టును దానం చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు ఓ ప్రైవేటు కాలేజ్ లో చదువుతున్న 80 మంది ఇంటర్ విద్యార్ధినిలు క్యాన్సర్ రోగుల కోసం జుట్టును దానం చేశారు. దేశంలో క్యాన్సర్ బారిన పడినవారు ఎంతో బాధపడుతున్నారు. అటువంటివారికి మేము ఆర్థిక సహాయం ఎలాగూ చేయలేము. కానీ మా వంతుగా..క్యాన్సర్ రోగులు మా జుట్టుని దానం చేయాలని అనుకున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com