ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలూ మీపై వేధింపులకు ఇలా చెక్ పెట్టండి...!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 06:24 PM

మన దేశంలో నిమిషానికి రెండు, మూడు మహిళలపై నేరాలు జరుగుతున్నాయి. కిడ్నాప్‌, అత్యాచారం, లైంగిక వేధింపులు ఇలా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి.


బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో ఆఖరికి ఇళ్లలో కూడా రక్షణ కరువైంది. అయితే మహిళలను కాపాడేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను చేసింది. వాటి ద్వారా మహిళలపై జరిగే నేరాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంది. ఆ చట్టాల ద్వారా మహిళలపై దుశ్చర్యలకు పాల్పడి వారికి కఠిన శిక్షలు పడతాయి.


బాల్య వివాహ నిషేధ చట్టం...


మన దేశంలో బాల్య వివాహాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అమ్మాయిలకు 18 ఏళ్ల కంటే ముందే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. దీంతో ఎంతోమంది అమ్మాయిలు విద్యకు దూరమవుతున్నారు. చిన్నప్పుడే బాధ్యతల భారాన్ని మోస్తున్నారు. అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ బాల్య వివాహాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తెచ్చింది. 2007లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిలకు పెళ్లిల్లు తలపడితే ఆ తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.


వరకట్న నిషేధ చట్టం, 1961...


ఈ చట్టం ప్రకారం పెళ్లి సమయంలో కట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం. దేశంలో ఆడపిల్లల పెళ్లి జరగాలంటే కట్నం ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ కట్నం కోసం తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. పెళ్లి తర్వాత కూడా మహిళలను అత్తమామలు, భర్త కట్నం కోసం వేధిస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం వరకట్నం నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం మహిళలను కట్నం కోసం వేధిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.


ప్రసూతి ప్రయోజన చట్టం, 1861..


ఈ చట్టం ప్రకారం మహిళలు ప్రసూతి ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా సంస్థలో పనిచేసే మహిళలు ప్రెగ్నెంట్ అయితే ఈ చట్టం ప్రకారం పూర్తి వేతనంత ప్రసూతి సెలవులను పొందవచ్చు. ఇందులో ప్రసూతి సెలవులు, మెడికల్ ఎలవెన్స్ మొదలైనవి ఉన్నాయి.


ఆఫీసుల్లో మహిళల లైంగిక వేధింపులు నిషేద చట్టం, 2013...


ఆఫీసుల్లో మహిళల భద్రతను పెంచేందుకు ఈ చట్టం ముఖ్య లక్ష్యం. ఆఫీసుల్లో మహిళలపై లైంగిక వేధింపులకు గురైతే ఈ చట్టం ప్రకారం రక్షణ లభిస్తుంది.


చాలా కంపెనీల్లో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. అసభ్యంగా మాట్లాడడం, టచ్ చేయడం, ఎవరూ చూడనప్పుడు దాడి చేయడం వంటివి ఈ చట్ట పరిధిలోకి వస్తాయి.


సమాన వేతనం చట్టం, 1976...


కంపెనీల్లో మగవాళ్లతో సమానంగా మహిళలు పనిచేసినా.. వేతనాల విషయంలో మాత్రం తేడాలుంటాయి. జీతాలు మహిళలకు తక్కువగా ఉంటాయి. ఈ వివక్షతను నిరోధించేందుకు సమాన వేతన చట్టం వచ్చింది. మగవాళ్లతో సమానంగా మహిళలకు వేతనాలుండాలి. అలా జరగకుండా మహిళలకు అన్యాయం జరిగితే ఈ చట్టాన్ని ఆశ్రయించి ఆ ప్రయోజనాన్ని పొందవచ్చు.


నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్, 1990...


చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణలను పర్యవేక్షించడానికి 1992లో జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 1990లో పార్లమెంట్ ఒక చట్టం చేసింది. అందువల్ల జాతీయ మహిళా కమిషన్ చట్టపరమైన సంస్థ. మహిళల సమస్యలకు, వారి ఆందోళనలకు మహిళా కమిషన్ స్వరం అందిస్తుంది. మహిళలకు అండగా నిలిచి వారికి న్యాయం జరిగేలా చేస్తోంది. మహిళలు అన్ని రకాలు అభివృద్ధి చేయడమే ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com