ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలితాలు (20-09-2020)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 20, 2020, 09:30 AM

రాశి- మేషం


వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ఏదైనా వస్తువు కొనుగోలుకు షాపింగ్ చేస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది.


రాశి- వృషభం


విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. పనులలో ఆటంకాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ది. స్థిరచరాస్తుల క్రయ, విక్రయాల్లో పునరాలోచన అవసరం.


రాశి- మిధునం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. బంధువుల కలయిక. ఇంటాబయటా చికాకులు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం అవుతుంది.


రాశి- కర్కాటకం


కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. పాత రుణాలు చెల్లిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఎదటి వారితో ఆచితూచి సంభాషించండి. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు.


రాశి- సింహం


ప్రైవేటు సంస్థల్లో వారు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించవలసి ఉంటుంది. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. ఆలయ సందర్శనాలతో ప్రశాంతత చేకూరుతుంది.


రాశి- కన్య


ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలు నెరవేరుతాయి. దూర ప్రయాణాలో ఏకాగ్రత చాలా అవసరం. ప్రయాణాలలో మార్పులు. కుటుంబసమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు పనిభారం అధికమవుతుంది.


రాశి- తుల


చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి.


రాశి- వృశ్చికం


చిన్నతరహా పరిశ్రమల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. భాగస్వామిక, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ఉపాధ్యాయులకు విద్యార్థులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి.


రాశి- ధనస్సు


రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. రాబడికి మించిన ఖర్చుల వల్ల చేబదుళ్లు తప్పవు. ఉద్యోగస్తులు సమర్థతను అధికారులు గుర్తిస్తారు.


రాశి- మకరం


ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇంటాబయటా చికాకులు. ప్రైవేటు సంస్థలో వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది.


రాశి- కుంభం


ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. రాజకీయాల వారికి పార్టీపరంగా గుర్తింపు లభిస్తుంది. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి.


రాశి- మీనం


పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు అయినవారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు , ఉద్యోగాలలో పురోగతి. ప్రముఖుల కలయిక వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com