ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే శాఖలో 1000 ఉద్యోగాలు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 20, 2020, 09:24 AM

భారతీయ రైల్వేలో, రైల్వే అనుబంధ సంస్థలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 1000 ఉద్యోగాలను ప్రకటించింది. ఇవన్నీ అప్రెంటీస్ పోస్టులే. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 సెప్టెంబర్ 4న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.pbicf.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. ఎంపికైనవారికి 2020 అక్టోబర్ 1 నుంచి ట్రైనింగ్ ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com