16 నెలల్లో ప్రజలపై రూ.20వేల కోట్ల భారం: యనమల

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 02:17 PM
 

ఏపీ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. 16 నెలల్లో ప్రజలపై రూ.20వేల కోట్ల భారం మోపారని వెల్లడించారు. ఎగుమతుల ప్రోత్సాహక ఇండెక్స్‌లో ఏపీ 21వ స్థానానికి దిగజారిందన్నారు. గత ఏడాదితో పోల్చితే తొలి త్రైమాసికంలో 363శాతం అప్పులు పెరిగాయన్నారు. సహజ వనరులను వైసీపీ మాఫియా దోచుకుంటోందని యనమల పేర్కొన్నారు.