మంత్రి జయరాంపై సీఎం జగన్ ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూస్తాం : అయ్యన్నపాత్రుడు

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 01:07 PM
 

ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏ14 నిందితుడు కార్తీక్.. మంత్రి జయరాంకు బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నేత చేసిన ఆరోపణలను మంత్రి కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అయ్యన్నపాత్రుడు బెంజ్ కారుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను మీడియాకు చూపించారు. ఫొటోలు, వీడియోలు స్క్రీన్ మీద వేసి తేటతెల్లం చేశారు. ఇన్ని ఆధారాలు ఇచ్చినా మంత్రి జయరాంపై సీఎం జగన్ ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూస్తామని తెలిపారు.