లారీని ఢీకొన్న ఇన్నోవా…

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 12:20 PM
 

అనంతపురం: మడకశిర మండలం  చంద్రబావి వద్ద ఆగివున్న లారీని ఇన్నోవా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.