బర్త్ డే పార్టీలో పాల్గొన్న యువకుని మృతదేహం స్విమ్మింగ్ పూల్ లో

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 11:54 AM
 

విశాఖ జిల్లా లోని ఓ ప్రైవేటు రిసార్ట్స్లో బర్త్ డే పార్టీలో పాల్గొన్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పార్టీలో పాల్గొన్న ఈ యువకుడి మృతదేహం స్విమ్మింగ్పూల్లో కనిపించడంతో స్నేహితుల చంపేశారు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.గాజువాక చెందిన సుధాకర్ అనే యువకుడు పుట్టినరోజు సందర్భంగా నిన్న అచ్యుతాపురం మండలం కొండకర్ల వద్ద ఓ ప్రైవేట్ రిసార్ట్స్లో బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు. సుధాకర్ కి చెందిన మొత్తం 10 మంది స్నేహితులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరిలో గాజువాక బి.సి కాలనీకి చెందిన సాయి అనే యువకుడు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయాడని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పదోతరగతి చదువుతున్న ఈ సాయి తల్లిదండ్రులు మరణించడంతో బంధువుల ఇంట్లో ఉంటూ న్నారు. ఈ దశలో స్విమ్మింగ్పూల్లో సాయి మృతదేహం కనిపించడంతో అతని చిన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు తోటి స్నేహితులు చంపేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.