వైసిపిలోకి విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 11:07 AM
 

టీడీపీకి వరుసుగా షాక్ లు తగుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చేజారిపోతున్నారు. కొంతమంది వైసీపీ గూటికి చేరుతున్నారు. ప్రధానంగా టీడీపీకి కంచుకోటగా విశాఖ ఉంది. ప్రస్తుతం దీనికి బీటలు పడుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసుపల్లి గణేష్ వైసీపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. గత కొంతకాలంగా గణేష్ టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. 2009 ఎన్నికల్లో విశాఖ దక్షిణం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున వాసుపల్లి గణేష్ పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014లో విజయం సాధించారు.. 2019లో మళ్లీ గెలిచారు. కాగా ఆదివారం నాడు సీఎం జగన్ ను వాసుపల్లి కలువనున్నారని టాక్. టీడీపీ తరఫున శాసనసభకు పోటీ చేసి విజయం సాధించిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిలు వైసీపీ పార్టీలో చేరని సంగతి తెలిసిందే. టెక్నికల్ గా పార్టీలో చేరకపోయినా మద్దతు ఇస్తున్నారు. ఇదే బాటలో గణేష్ పయనిస్తారని అంటున్నారు.