ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి పేటిఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 08:43 PM

కొన్ని గంటల క్రితం గూగుల్ ప్లే స్టోర్ పేటిఎం యాప్ ను తొలగించిన విషయం తెలిసిందే. జూదాలు,ఆన్ లైన్ బెట్టింగ్స్ నిర్వహిస్తుండడంతో పేటిఎం యాప్ కు గూగుల్ ప్లే స్టోర్ గతంలోనే హెచ్చరించింది. అయినా పద్దతి మారకపోవడంతో ప్లే స్టోర్ నుంచి పేటిఎం యాప్ ను గూగుల్ తొలగించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పేటిఎం వినియోగదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని,త్వరలోనే సేవలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది సేపటి క్రితం నుంచి మళ్లీ ప్లే స్టోర్ లో పేటిఎం యాప్ వస్తుంది. పేటిఎం యాప్ ప్రతినిధుల గూగుల్ ప్రతినిధులతో చర్చలు జరపడంతో పలు ఒప్పందాల ప్రకారం గూగుల్ లో మళ్లీ పేటిఎం యాప్ వస్తుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com