ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హోం లోన్' తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు చేయకండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 01:43 PM

హోంలోన్ ప్లాన్ చేస్తున్నారా? తక్కువ వడ్డీ రేట్లతో హోం లోన్లు అట్రాక్ట్ చేస్తుంటాయి బ్యాంకులు.. ఫైనాన్స్ సంస్థలు.. తక్కువ వడ్డీకే హోం లోన్లు వస్తున్నాయి కదా? అని ఇళ్లు లేదా హోం లోన్ తీసుకునేందుకు తొందరపడొద్దని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.. లేదంటే.. అప్పుల ఊభి (డెబ్ట్ ట్రాప్)లో పడిపోతారు జాగ్రత్త అని అంటున్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో హోం లోన్లు 6.7 శాతం వరకు తక్కువ వడ్డీ రేట్లతో అందుబాటులో ఉన్నాయి.. ముందు వెనుక ఆలోచించకుండా హోం లోన్లు తీసుకుంటే.. భవిష్యత్తులో అవసరమైన అత్యవసరమైన లోన్లలో పిల్లల చదువు కోసం లోన్ లేదా రిటైర్ మెంట్ వంటి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. మీకు తెలియకుండానే ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారని అంటున్నారు.. ఒకసారి హోం లోన్ తీసుకున్నాక వాటి ఈఎంఐ వాయిదాలను చెల్లించలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పదని అంటున్నారు.. కరోనా సంక్షోభ సమయంలో ఎవరైనా ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏదైనా మంచి హోం లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాల్లో తొందరపడకుండా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. అవేంటో ఓసారి లుక్కేయండి..
1. ఇల్లా లేదా హోం లోన్.. ఏది ఫస్ట్ ఎంచుకోవాలి? :
ఇల్లు కొనాలనే ఆశ అందరిలోనూ ఉంటుంది.. ఇల్లు కొంటున్నారా? లేదా హోం లోన్ తీసుకుంటున్నారా? అనేది ముందుగా ఎంచుకోవాలి. అంటే.. మీ చేతిలో డబ్బులు ఉంటే అమ్మే వ్యక్తి నుంచి నేరుగా ఇల్లును సొంతం చేసుకోవచ్చు.. అదే హోం లోన్ ద్వారా అయితే కచ్చితంగా బ్యాంకు నుంచి తీసుకోవాల్సిందే.. అది కూడా మీరు బ్రోకర్ ద్వారా మాత్రమే వెళ్లాల్సి వస్తుంది.. ఈ విషయంలో కొన్నిసార్లు బ్యాంకులు మీ హోం లోన్ తిరస్కరించే అవకాశం ఉంది.
ఇల్లు అమ్మే వ్యక్తి ఒక నిర్దిష్ట సమయానికి డబ్బులన్నీ చెల్లించాలని డిమాండ్ చేస్తే.. చెల్లించడం కష్టమే మరి.. మీ చేతుల్లో డబ్బులు లేకుంటే బ్యాంకు నుంచి రుణం పొందాల్సి ఉంటుంది.. పెద్ద మొత్తంలో ఈఎంఐలు చెల్లించలేని పక్షంలో బ్యాంకులు తప్పనిసరిగా డౌన్ పేమెంట్ రూపంలో ఎంతో కొంత మొత్తాన్ని ఇచ్చే రుణంపై చెల్లించాలని డిమాండ్ చేస్తాయి. అందుకే హోం లోన్ తీసుకునే ముందు ఆయా లోన్ వివరాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యమని గుర్తించుకోండి.
ఇల్లు కొనేందుకు అమ్మే వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోండి.. మీ క్రెడిట్ స్కోరు చెక్ చేసుకోండి.. ఇల్లు ఎంత వాల్యూ ఉందో అవసరానిబట్టి.. ఎంత మొత్తంలో లోన్ కావాలో నిర్ణయించుకోండి. లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు, ఇతరేతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిబట్టి మీకు ఎంత లోన్ కావాలి? ఛార్జీలు చెల్లించాక ఎంతవరకు లోన్ అమౌంట్ మీ చేతికి వస్తుందో అంచనా వేసుకోవాలి.
2. మీ ఉద్యోగం సురక్షితమేనా? :
కోవిడ్ సంక్షోభ సమయంలో నిరుదోగ్య సమస్య ఎక్కువైంది.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసే ఉద్యోగం సురక్షితమా? స్థిరమైన ఉద్యోగంలో ఉన్నారా? అని ముందుగా ఆలోచించుకోండి.. హోం లోన్ తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ కూడా ఈ నెలసరి ఆదాయాన్ని తప్పక అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. మీకు నెలవారీగా జీతం చేతికి వస్తేనే ఆర్థికంగా నిలబడగలరు.. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనాన్ని కట్ చేస్తున్నాయి.. ఈ పరిస్థితుల్లో భారీ ఈఎంఐలు చెల్లించాలంటే మీకొచ్చే జీతం సరిపోతుందా? అని ప్రశ్నించుకోండి.. నెలవారీ కట్టాల్సిన ఈఎంఐలు ఎగ్గొట్టినా మీ క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్రభావం పడుతుంది జాగ్రత్త.. సుదీర్ఘ కాలం ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది..
3. లాక్ డౌన్ సమయంలో ఏదైనా EMI చెల్లించలేదా? :
గత ఆరు నెలలుగా కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ఉద్యోగులు వేతనంలో కోత కారణంగా లేదా ఉద్యోగం కోల్పోయిన పరిస్థితి ఎదురైంది.. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకున్న భారీ హోం లోన్లకు ఈఎంఐలు పూర్తిగా చెల్లించలేని పరిస్థితి.. నెలవారీ ఈఎంఐలు చెల్లించలేకపోతే.. కనీసం మినమం డ్యూ అమౌంట్ అయినా క్రెడిట్ కార్డుపై చెల్లించే అవకాశం ఉంది.. కానీ, వడ్డీ భారీగా పడుతుంది.
ఉద్యోగం కోల్పోయిన తర్వాత మరో కొత్త ఉద్యోగం దొరికినా అక్కడ తక్కువ వేతనం తీసుకుంటే మాత్రం అది మీ హోం లోన్ మొత్తంతో పాటు మీ క్రెడిట్ స్కోరుపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే చిన్న మొత్తంలో మీ వేతనానికి తగిన ఇంటిని కొనేందుకు ప్రయత్నించాలి. మీకు వచ్చే లోన్ మొత్తం ఆధారంగా హోం లోన్ తీసుకోవాలి. అందులో మీరు చెల్లించాల్సిన డౌన్ పేమెంట్ కూడా సరిపోయి చేతిలో ఇల్లు కొనగలిగేంత డబ్బులు ఉండాలి. మీ ఈఎంఐలు చెల్లించకుంటే మాత్రం మీ ఫ్రెష్ క్రెడిట్ స్కోరు, లోన్ అర్హత వంటివి మరోసారి చెక్ చేసుకోండి..
4. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నారా?
హోం లోన్ తీసుకునే ముందు మీరు ఓసారి ఆర్థికపరమైన చిక్కుల నుంచి ఎలా బయటపడాలో నిర్ధారించుకోవాలి. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో మరో కొత్త ఆర్థిక ఇబ్బందులను కొనితెచ్చుకోకూడదని గుర్తించాలి. ఈ పరిస్థితుల్లో మీ వేతనంలో కోత పడినా లేదా ఉద్యోగమే కోల్పోయినా చెల్లించాల్సిన ఈఎంఐలతో కష్టమైపోతుందని మరవొద్దు.. హఠాత్తుగా మరణించినా లేదా వైకల్యం కలిగినా లోన్ చెల్లించలేని పరిస్థితి ఎదురవుతుంది.
5. మీ భాగస్వామిని రుణదారుగా చేర్చారా?:
ఒకవేళ మీ భార్య ఉద్యోగం చేస్తుంటే.. పర్వాలేదు.. లేదంటే.. ఒకరిపైనే ఆర్థిక భారం తప్పదు.. భాగస్వామి ఉద్యోగం చేస్తుంటే మాత్రం వారి పేరు మీదే ప్రైమరీ లోన్ తీసుకోవచ్చు.. పురుషుల కంటే మహిళలకే తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తున్నాయి బ్యాంకులు. మీ భాగస్వామిని కో ఓనర్, కో అప్లికెంట్ గా చేరిస్తే.. మీరు తీసుకున్న రుణంపై ప్రిన్సిపుల్, వడ్డీ చెల్లింపుపై ట్యాక్స్ బెనిఫెట్ పొందొచ్చు.. 24B సెక్షన్ కింద భాగస్వాములు సొంత ఇంటిపై చెల్లించే వడ్డీపై ఒక్కొక్కరు రూ.2 లక్షల వరకు బెనిఫెట్ పొందవచ్చు. 80C సెక్షన్ కింద ప్రిన్సిపల్ రీపేమెంట్ కోసం ఒక్కొక్కరు 1.5 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com