ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 70వ జన్మదినం జరుపుకుంటున్న మోదీకి ఆయా రాష్ర్టాల సీఎంలు, నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మోదీ బర్త్డే సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు దేశ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 70 కేజీల లడ్డూను కూడా తయారు చేయించినట్లు బీజేపీ కార్యకర్తలు తెలిపారు.