ఎపిలో గ‌త‌ 24 గంటల్లో 8835 కొత్త కేసులు

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 17, 2020, 08:57 AM
 

ఎపిలో గ‌త‌ 24 గంటల్లో 75,013 శాంపిల్స్ పరీక్షించగా 8835 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం ఎపిలో కేసుల సంఖ్య అయిదు ల‌క్షల 92 వేల 760 కి చేరాయి.. కొత్త కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలోనే 1421 ఉన్నాయి. కాగా, తూర్పు గోదావరిలో ఇప్పటివరకు మొత్తం 81,064 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 424 కేసులు, గుంటూరు 685, విశాఖ 404, అనంతపురం 325, నెల్లూరు 562, ప.గో1051 , చిత్తూరు 798, కడప 536, ప్రకాశం 873 , విజయనగరం 544 , కృష్ణా 396, శ్రీకాకుళం 495 కేసులు నేడు నమోదు అయ్యాయి. ఇక గ‌డిచిన 24 గంటల్లో 64 మంది కరోనాతో మ‌ర‌ణించారు.., రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5105 కి కరోనా మరణాలు చేరాయి. ఈ రోజు నమోదయిన మరణాలు వివరాలు ఇలా ఉన్నాయి…శ్రీకాకుళంలో 5, గుంటూరులో ఆరు, విజయనగరంలో ఇద్ద‌రు, తూర్పుగోదావరిలో 3, ప్రకాశంలో 6, చిత్తూరులో 9 మంది, కడపలో 5, అనంతపూర్‌లో 5, పశ్చిమ గోదావరిలో 5, కృష్ణలో 5, కర్నూలులో 4, నెల్లూరులో 7, విశాఖపట్నంలో ఇద్ద‌రు మరణించారు. ఇక నిన్న 10,845 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం ఎపిలో 90 వేల 279 మంది చికిత్స పొందుతున్నారు..