టీడీపీలో చేరి తప్పుచేశా.. ఇక గుడ్ బై: మురళీ మోహన్

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 16, 2020, 08:33 PM
 

తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది రాజకీయాల్లోకి రావడమే అని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, ప్రముఖ సినీనటుడు మురళీ మోహన్ అన్నారు. తనకు ఇష్టం లేదని చెప్పినా చంద్రబాబు కన్వెన్స్ చేసి రాజకీయాల్లోకి తీసుకువచ్చారని, ఆ పదేళ్ల టైంలో చాలా కోల్పోయని, రాజకీయాలంటే విరక్తి కలిగేలా చేశారంటూ సంచలన కామెంట్స్ చేశారు మురళీ మోహన్. ఇక చాలు ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయను.. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండటం నా వల్ల కాదు. ఎనభై ఏళ్లలో ఇంకా పార్టీ కోసం పనిచేయడం నా వల్ల కాదని గుడ్ బై చెప్పి వచ్చేశా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మురళీమోహన్. కాగా మురళీమోహన్ 2009లో టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీచేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడారు. తర్వాత 2014లో తిరిగి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉండటమే కాకుండా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.