ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నింగిలో బిడ్డను ప్రసవించిన మహిళ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 15, 2020, 06:25 PM

ఓ మహిళ తన బిడ్డకు ‘స్కై’ అని పేరు పెట్టింది. ఎందుకంటే.. ఆమె ఆ బిడ్డను నింగిలో ప్రసవించిందట. అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆమె తన బిడ్డకు ఆ పేరు పెట్టిందట. ఆ పేరు పెట్టిన ఆ తల్లి పేరు చ్రెస్టాల్ హిక్స్. టిఒఐ కథనం మేరకు..అలస్కాకు చెందిన ఆమె ఓ రోజు విమానంలో ఉండగా నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో విమానం భూమికి సుమారు 18 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. ఈ సమాచారం తెలిసి పైలట్ అత్యవసరంగా విమానాన్ని ఏదైనా విమానాశ్రయంలో దించేద్దామని అనుకున్నారు. అయితే, అప్పటికే ఆమెకు పండండి మగ బిడ్డ పుట్టేశాడు. ఆమె క్షేమంగానే ఉండటంతో విమనాన్ని ఆమె చేరాల్సిన గమ్యస్థానంలోనే ల్యాండ్ చేశారు.ఆంకరేజ్‌ హాస్పిటల్‌లో చేరిన తర్వాత ఆమెకు కొత్త సమస్య వచ్చి పడింది. బర్త్ సర్టిఫికెట్‌లో ఆమె పుట్టిన ప్రాంతం గురించి అడిగారు. చిన్నారి ఆకాశంలో పుట్టడం వల్ల అక్కడ ఏం రాయలో అర్థం కాలేదు. చివరికి తమ నగరం ఆంకరేజ్‌లోనే బిడ్డను కన్నానని పేర్కొంది. అయితే, బిడ్డ పేరు మాత్రం ‘స్కై ఐరోన్ హిక్స్’ అని పెట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com