ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీకల్లోతు నీటిలోనూ బైక్ రైడ్..!

national |  Suryaa Desk  | Published : Fri, Aug 14, 2020, 07:48 PM

నీటిలో బైకు నడపడం కష్టమనే విషయం తెలిసిందే. సైలెన్సర్‌లోకి నీళ్లు వెళ్తే.. బైకు ముందుకు వెళ్లనని మొరాయిస్తుంది. ఇక వరదల సమయంలో బైకుపై తిరగడమంటే సమస్యలు కొనితెచ్చుకున్నట్లే. అయితే, సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇందులోని యువకులు పీకల్లోతు నీటిలో కూడా బైకును నడిపేస్తున్నారు. బైకుకు ఉండే సైలెన్సర్‌ను పూర్తిగా మార్చేశారు. అది బైకు కిందకు ఉండకుండా బైకర్ తల మీదకు ఉండేలా మార్చారు. పెట్రోల్ ట్యాంకులోకి నీళ్లు వెళ్లినా బైకు ఆగిపోయే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా వారు ఓ బాటిల్‌లో పెట్రోల్ వేసి పైపు ద్వారా ఇంజిన్‌ను అనుసంధానించారు. ఫలితంగా బైకు నీటిలోకి వెళ్లినా ఇంజిన్ చక్కగా పనిచేస్తోంది. దీంతో వారు వరద నీటిలో కూడా సులభంగా బైకు నడిపేస్తున్నారు. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్వీట్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com