ఎస్‌బీఐలో 3850 ఉద్యోగాలు..2 రోజులే గడువు

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 14, 2020, 07:42 PM
 

బ్యాంకు ఉద్యోగం కోరుకుంటున్నవారికి గుడ్ న్యూస్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 3850 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ సర్కిల్‌లోనూ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ సర్కిల్‌కు 550 ఖాళీలను ప్రకటించింది ఎస్‌బీఐ. తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో మొత్తం 3850 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.


మొత్తం ఖాళీలు: 3850


 


తెలంగాణ- 550,


గుజరాత్- 750,


కర్నాటక- 750,


మధ్యప్రదేశ్- 296,


చత్తీస్‌గఢ్- 104,


తమిళనాడు- 55,


రాజస్థాన్- 300,


మహారాష్ట్ర- 517,


గోవా- 33 పోస్టులున్నాయి.


 


దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 27న ప్రారంభమైంది.


అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 16 చివరి తేదీ.


దరఖాస్తు ఎడిట్ చేయడానికి 2020 ఆగస్ట్ 16 చివరి తేదీ.


దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీ.


డిగ్రీ అర్హతతో ఈ ఖాళీలను ఎస్బీఐ భర్తీ చేస్తోంది.


వయస్సు 2020 ఆగస్ట్ 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి.


జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థుల రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.


ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.


దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.


ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.sbi.co.in/web/careers/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.