ఒకే ఇంట్లో ఏడుగురికి కరోనా పాజిటివ్.. ఆ గ్రామంలో టెన్షన్

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 14, 2020, 07:39 PM
 

దేవనకొండ మండలంలోని నల్లచెలిమల గ్రామంలోని ఓ ఇంట్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణైనట్లు వైద్యాధికారి బలరాం నాయక్ తెలిపారు. బాధితులను కర్నూలు కోవిడ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కు, శానిటైజర్ వాడుతూ కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. విపరీతమైన దగ్గు, జ్వరం ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలన్నారు.