వాట్సాప్ లో ఇండిపెండెన్సు డే స్టిక్కర్లు..డౌన్‌లోడ్ చేయండిలా

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 14, 2020, 07:38 PM
 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాట్సాప్ మనకో గుడ్ న్యూస్ చెప్పింది. ప్లేస్టోర్‌లో ఇండిపెండెన్సు డే స్టిక్కర్లున్నాయి. మామూలు స్టిక్కర్ల‌తో పాటు యానిమేటెడ్ స్టిక్కర్లని థర్డ్ పార్టీ డెవలపర్లు తయారు చేస్తున్నారు. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని వాట్సప్‌లో ఎవరికైనా పంపొచ్చు. వాట్సప్‌లో డిఫాల్ట్‌గా కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి. కానీ ఇండిపెండెన్స్ డే లాంటి ప్రత్యేక సందర్భాలకు మాత్రం థర్డ్ పార్టీ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. వాట్సప్‌లో ఇండిపెండెన్స్ డే స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి. ఛాట్ విండో ఓపెన్ చేసి ఎమొజీ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీకు ఎమొజీ, GIF, స్టిక్కర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. స్టిక్కర్ సెక్షన్ సెలెక్ట్ చేయండి. కిందకు స్క్రోల్ చేసి చివర్లో 'గెట్ మోర్ స్టైకెర్స్' పైన క్లిక్ చేయాలి. అప్పుడు యాప్ స్టోర్ ఓపెన్ అవుతుంది. యాప్ స్టోర్‌లో WAStickerApps Independence Day లేదా WAStickerApps Independence Day Animated అని టైప్ చేయండి.ప్లే స్టోర్‌లో ఇండిపెండెన్సు డే స్టిక్కర్ ప్యాక్ కనిపిస్తాయి. ప్లేస్టోర్‌లోని స్టిక్కర్ ప్యాక్స్‌లో యానిమేటెడ్ స్టిక్కర్స్‌తో పాటు సాధారణ స్టిక్కర్స్ కూడా ఉంటాయి. వాటిలో మీకు నచ్చినవి డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన స్టిక్కర్ ప్యాక్ ఓపెన్ చేయాలి. స్టిక్కర్లను 'Add to WhatsApp' అని క్లిక్ చేస్తే ఆ స్టిక్కర్లు మీ వాట్సప్‌లోకి వచ్చేస్తాయి. మీరు మళ్లీ వాట్సప్‌లో స్టిక్కర్స్ లిస్ట్‌లోకి వెళ్లి చూస్తే ఇండిపెండెన్స్ డే స్టిక్కర్స్ కనిపిస్తాయి. ఇలా కాకుండా మీరు నేరుగా యాప్ స్టోర్‌లోకి వెళ్లి కూడా స్టిక్కర్ ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటిని మీ స్నేహితులకు, బంధువులకు పంపొచ్చు. మీరు యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని ఇతరులకు పంపడం మాత్రమే కాదు సేవ్ కూడా చేయొచ్చు. థర్డ్ పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. యానిమేటెడ్ స్టిక్కర్స్ కోసం హానికరమైన యాప్స్ డౌన్‌లోడ్ చేయకూడదు. ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసేముందు రేటింగ్స్, రివ్యూస్ పరిశీలించండి.