ఏపీ కరోనా బులెటిన్ విడుదల

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 12, 2020, 07:25 PM
 

ఏపీలో గత 24 గంటల్లో 9597 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,146కి చేరింది. గత 24 గంటల్లో 93 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2296కి చేరింది. 1,61,425 మంది డిశ్చార్జు కాగా 90,425 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలిలా ఉన్నాయి. అనంతపూర్ 781,చిత్తూరు 1235,తూర్పుగోదావరి 1332,గుంటూరు 762,కడప 364,కృష్ణా 335,కర్నూలు 781,నెల్లూరు 723,ప్రకాశం 454,శ్రీకాకుళం 511,విశాఖ 797,విజయనగరం 593,పశ్చిమగోదావరి 929 కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో జిల్లాల వారీగా మరణించిన వారి వివరాలిలా ఉన్నాయి. గుంటూరులో 13 మంది, ప్రకాశంలో 11, చిత్తూరులో 10 మంది, నెల్లూరులో పది మంది, శ్రీకాకుళంలో తొమ్మిది మంది, అనంతపురంలో ఏడుగురు, కడపలో ఏడుగురు, విశాఖపట్టణంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కర్నూలులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు మరణించారు.