సచివాలయ పరీక్ష తేదీలు ఖరారు

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 12, 2020, 07:18 PM
 

ఏపీలో సెప్టెంబర్ 20 నుంచి గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి రోజే సుమారు 4.5 లక్షల మంది వరకు పరీక్షలు రాయనున్నారు. 3 వేల నుంచి 5 వేల పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వివరాలన్ని వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు.