చదువుకోవడానికి లోన్..పొందండిలా

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 12, 2020, 07:18 PM
 

ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పేరుతో ఓ వెబ్‌సైట్ ప్రారంభించింది. www.vidyalakshmi.co.in/ వెబ్‌సైట్‌లో విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనెరా బ్యాంకు లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో లోన్స్ ఇస్తాయి. 36 బ్యాంకుల నుంచి 110 లోన్ స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ ఉన్నత విద్య అవసరాలకు తగ్గట్టుగా ఇందులోంచి లోన్ స్కీమ్ ఎంచుకోవచ్చు. విద్యార్థులు ముందుగా www.vidyalakshmi.co.in/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోనే Apply Now ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.అందులో మీ పేరు, తండ్రి పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి యాక్టివేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి యాక్టివేషన్ చేయాలి. ఆ తర్వాత లోన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ముందుగా కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి. మీ ఇన్‌కమ్ ప్రూఫ్స్, ఐడీ ప్రూఫ్స్, సర్టిఫికెట్స్ అన్నీ అందుబాటులో ఉంచుకోవాలి. బ్యాంకులో ఎడ్యుకేషన్ స్కీమ్ సెలెక్ట్ చేసి దరఖాస్తు చేసేందుకు ఈ ఫామ్ ఉపయోగపడుతుంది. లోన్‌కు దరఖాస్తు చేసే ముందు నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవడం తప్పనిసరి. లేకపోతే సరిగ్గా దరఖాస్తు చేయకపోవడమో, అప్లికేషన్ రిజెక్ట్ కావడమో జరగొచ్చు.