సంజయ్ దత్ ఆరోగ్యంపై ప్రకటన

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 12, 2020, 07:16 PM
 

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం గురించి సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజయ్ ఆరోగ్యంపై ఆయన భార్య మాన్యత దత్‌ స్పందించారు. సంజయ్‌ ఎప్పుడూ పోరాట యోధుడేనని, ఈ సారి కూడా విజయం ఆయనదే అవుతుందని స్పష్టం చేశారు.ఇలాంటి క్లిష్ట సమయంలో అభిమానుల ప్రార్థనలు, ఆశీర్వాదాలు కావాలని ఓ ప్రకటనలో తెలిపారు. సంజయ్‌ దత్‌ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కఠిన సమయాన్ని దాటేందుకు మీ అందరి తోడు కావాని కోరారు. గతంలో కూడా ఎన్నో ఆపదల నుంచి తమ కుటుంబం బయపడిందన్నారు. ఈ ఇబ్బందికర పరిస్థితిని కూడా దాటేస్తామన్నారు. సంజయ్‌దత్‌ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఆయన అభిమానులు నమ్మవద్దన్నారు.