పోలీస్ శాఖలో 250కి పైగా కరోనా బాధితులు.. ఆ శాఖలో 200కి పైగా

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 12, 2020, 07:09 PM
 

కర్నూలు జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా పోలీసులు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఇలా మొత్తం జిల్లా వ్యాప్తంగా 250 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వీరిలో 40 మంది కోలుకోగా, మిగిలిన సిబ్బంది స్వీయ గృహ నిర్బంధం, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు నందవరం, నంద్యాల, బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో ఇద్దరు కలిపి మొత్తం ఐదుగురు కరోనాతో మరణించారు.ఇక జిల్లా వైద్య శాఖ సిబ్బంది తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పటికే ఇరవై మంది పీహెచ్సీ వైద్యులు, అధికారులు కోవిడ్ బారిన పడగా స్టాఫ్ నర్సులు, నర్సింగ్ శిక్షణ విద్యార్థులు, హౌజ్ సర్జన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇలా జిల్లాలో మొత్తం 200 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇక ప్రైవేట్ వైద్యులు కర్నూలులో ఒకరు, డోన్ లో మరొకరు, ఆర్ఎంపీ వైద్యుడు కరోనాతో మరణించారు.