ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తేజ్ పత్తా వలన అందానికి & ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 10, 2020, 05:14 PM

వాడుక భాషలో మసాల దినుసు లేదా తేజ్ పత్తాగా పిలువబడే బిర్యాని ఆకులను నేరుగా తినలేము. కానీ, ఆహార పదార్థాల తయారీలో వీటిని వాడటం వలన మంచి రుచితో పాటు, వాసనను ఉత్పత్తి చేస్తుంది. ఆహార పదార్థాల తయారీలలో మాత్రమేకాకుండా, పెర్ఫ్యూం (పరిమళ ద్రవ్యాలలో) తయారీలలో మరియు వీటిలో ఉండే ఎస్సేన్శియాల్ ఆయిల్ లను ఔషద తయారీలలో మరియు చికిత్సాపరమైన వాటిలలో వాడతారు. ఈ ఆకులు విటమిన్, మినరల్ మరియు బ్యాక్టీరియాను నాశనం చేసి, ఇన్ఫ్లమేషన్ లను తగ్గించే వృక్ష సంబంధిత సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వీటి వలన కలిగే ఇతర ప్రయోజనాల గురించి కింద తెలుపబడింది.


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది


సరైన పోషకాలను కలిగి ఉండి మరియు జీర్ణక్రియను మెరుగుపరిచే బిర్యాని ఆకు లేదా తేజ్ పపత్తాను వివిధ రకాల ఆహార పదార్థాలలో ఉపయోగిచండి. బిర్యాని ఆకులను సాంప్రదాయబద్దంగా అపానవాయువు, అజీర్ణం మరియు గుండెలో మంట వంటి సమస్యలను తగ్గించుటకు వాడతారు. దీనిని వంటలలో వాడటం వలన ఆకలిని పెంచుతుంది.


క్యాన్సర్ నివారణ


తేజ్ పత్తా, అధిక మొత్తంలో క్యాటేచిన్స్ వంటి వృక్ష ఆధారిత సమ్మేళనాలను కలిగి ఉండి, వివిధ రకాల క్యాన్సర్ వ్యాధి పెరుగుదలను నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అధ్యయనాల ప్రకారం, ఇలాంటి సమ్మేళనాలతో పాటుగా, వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు క్యాన్సర్ కణాల అభివృద్ధితో పాటుగా, వాటి సంఖ్యలో రెట్టింపు అయ్యే విభజనను అరికడతాయి.


యవ్వనంగా కనపడేలా చేస్తాయి


తేజ్ పత్తాలో ఉండే వృక్ష సంబంధిత సమ్మేళనాలు, శరీరంలో చేసే ఫ్రీ రాడికల్ లను తటస్థీకరింప చేసి, ముఖ చర్మంపై ఏర్పడే నల్లటి వలయలను మరియు గీతలను తొలగిస్తాయి. తేజ్ పత్తాను వాడి ఇంట్లోనే యాంటీ ఏజింగ్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఒక కుండలో నీటిని నింపి, తేజ్ పత్తిని కలిపి వేడి చేయటం వలన వీటి నుండి వచ్చే ఆవిరులను పీల్చటం ద్వారా చర్మ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.


జలుబు మరియు ఫ్లూ నుండి ఉపశమనం


శ్వాస వ్యవస్థలో కలిగే ఇన్ఫెక్షన్ లు అసౌకర్యానికి మరియు వాటి బహిర్గత లక్షణాలు చాలా చికాకులకు గురి చేస్తాయి. యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉండి, జలుబు మరియు ఫ్లూ వంటి అనారోగ్యాలను తగ్గిస్తుంది. బిర్యాని ఆకులను నీటిలో కలిపి వేడి చేయటం ప్రారభించి కషాయం రూపం వచ్చే వరకు వేచి ఉండండి. ఈ కషాయాన్ని చాతిపై ఆపాదించండి లేదా సేవించటం వలన వివిధ రకాల అసౌకర్యాలతో పాటుగా జలుబు, ఫ్లూ వంటి వాటి నుండి ఉపశమనం పొందుతారు.


జుట్టు సంబంధిత సమస్యలు చికిత్స


తేజ్ పత్తాను నీటిలో కలిపి వేడి చేయండి, ఈ ద్రావణాన్ని చల్లార్చి, మిశ్రమాన్ని జుట్టుకు ఆపాదించండి. ఈ మిశ్రమం చుండ్రును తగ్గించే సామార్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ మిశ్రమం జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకలను మందంగా మారుస్తుంది. తలపై జుట్టు లేని ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయటం వలన వీటిలో ఉండే ఎస్సేన్షియాల్ ఆయిల్ లు, జుట్టు తిరిగి పెరగటాన్ని ప్రేరేపిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com