ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు....

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 10, 2020, 04:50 PM

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్-NIRDPR భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 510 ఖాళీలను ప్రకటించింది. స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, యంగ్ ఫెలోస్, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిగ్రీ, పీజీ పూర్తిచేసినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 250 క్లర్టర్స్‌లో వీరిని నియమించనుంది. మొత్తం 510 ఖాళీలు ఉండగా అందులో స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్- 10, యంగ్ ఫెలోస్- 250, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్- 250 పోస్టులున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఖాళీల భర్తీ ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 10 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను nirdpr.org.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com