తెలంగాణ మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 10, 2020, 04:26 PM
 

గుంటూరు జిల్లా, తెనాలి, సుల్తానాబాద్‌లో అక్రమంగా తెలంగాణ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. లక్షా 25వేలు విలువచేసే 243 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. శానిటైజర్లు తాగి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు.