అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో కలకలం

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 10, 2020, 02:54 PM
 

అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో నోట్ల కట్టల కలకలం రేగింది. ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసిన పోలీసులకు గోపాల్ అనే ఓ ప్రయాణికుడి బ్యాగులో రూ. పది లక్షలు లభ్యమయ్యాయి. బంగారం కొనుగోలు చేసేందుకు నగదును బెంగళూరుకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులకు గోపాల్ తెలిపాడు. విచారణ నిమిత్తం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకువెళ్లారు. ఆధారాలు చూపించడంతో నగదును ప్రయాణికుడికి అప్పగించామని పోలీసులు చెబుతున్నారు.