ఏపీలో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ..

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 10, 2020, 02:14 PM
 

ఏపీ ప్రభుత్వం కొత్త ఇండస్ట్రియల్ పాలసీ రిలీజ్ చేసింది. ఈ పారిశ్రామిక విధానాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా విడుదల చేశారు. కరోనా పరిస్థితులు నేపధ్యంలో ప్రత్యేకంగా ఈ నూతన పాలసీని తీసుకు వచ్చామని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. సిఎం కూడా మొక్కుబడిగా కాకుండా ఆచరణ సాధ్యం అయ్యేలా ఉంటేనే ప్రకటించాలని చెప్పారని, నిపుణులు తో చర్చించి ఈ కొత్త పాలసీని రూపొందించామని అన్నారు. ప్రస్తుతం ఉన్న విధానం వల్ల ఉపాధి అవకాశాలు కూడా లేవని, అందుకే ఏపీ పారిశ్రామిక విధానం ఆదర్శం గా ఉండేలా తీర్చిదిద్దామని అన్నారు.


ఫార్మా, టెక్స్ట్ టైల్స్, పెట్రో, ఆటో మొబైల్ వంటివాటికి ప్రాధాన్యత ఇస్తున్నామని, 45వేల ఎకరాలలో ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్ చేయాలని భావిస్తున్నామని అన్నారు. వైయస్సార్ ఏపీ ఒన్ పేరుతో... పరిశ్రమలు ఏర్పాటు పూర్తి సరళతరం చేస్తున్నామని, ఏపీలో అమలయ్యే ఈ నూతన విధానం దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని, వర్క్ ఫ్రం హోం విధానాన్ని కూడా ఏపీలో త్వరలో అమలు చేస్తామని అన్నారు, గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందం ప్రకారం పరిశ్రమలు నడిపితే ఓకే చేయలేకుంటే... మాత్రం ఆ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేస్తామని అన్నారు.


కరోనా వల్ల ఇబ్బందులు వస్తే... వారు నిలదొక్కుకునేందుకు కొంత సమయం ఇస్తామని అన్నారు, రాష్ట్రం లో Apiic లో45వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని వీటిని జోన్ లుగా ఏర్పాటు చేసి... వివిధ రకాల పరిశ్రమలు కు అనుమతి ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. కెమికల్ పరిశ్రమలు కు ఒకే చోట కేటాయించి, అవసరం అయిన జాగ్రత్తలు తీసుకుంటామని పరిశ్రమలకు కావాల్సిన పవర్, వాటర్ ను అవసరం మేరకు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వివిధ శాఖల అనుమతులు కూడా నిబంధనల ప్రకారం ఉంటే వెంటనే ఇచ్చేలా చూస్తామని అన్నారు.


గత ప్రభుత్వం తీరు వల్ల పారిశ్రామిక వేత్తలు అనేక ఇబ్బందులు పడ్డారని మా విధానం ద్వారా... ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తంలో రెండు రకాల సర్వేలు నిర్వహించామని ప్రజల డిమాండ్ కు తగిన పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన ద్వారా పరిశ్రమలు అభివృద్ధి పై దృష్టి సారించామని అన్నారు. రామాయపట్నం సహా ఎనిమిది ఫిషింగ్ హార్బర్ లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని కరోనా వల్ల వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారని ఆయా ఉద్యోగాలు, పనులను స్థానిక యువకులకు అప్పగించేలా సర్వే చేస్తున్నామని అన్నారు.