ఎపిలో కొత్త‌గా 10820 పాజిటివ్స్ కేసులు

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 10, 2020, 01:52 PM
 

ఎపిలో నేడు రికార్డ్ స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి… గ‌డిచిన 24 గంట‌ల్లో ఏకంగా 97 మంది మ‌ర‌ణించారు.. అలాగే ఎపిలో గ‌త‌ 24 గంటల్లో 62,912శాంపిల్స్ పరీక్షించగా 10,820 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం ఎపిలో కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌ల 27 వేల 860 కి చేరాయి.. కొత్త కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలోనే 1543 ఉన్నాయి. కాగా, తూర్పు గోదావరిలో ఇప్పటివరకు మొత్తం 31,703 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 1399 కేసులు, గుంటూరు 881, విశాఖ 961, అనంతపురం 858, నెల్లూరు 696, ప.గో 1132, చిత్తూరు 848, కడప 823, ప్రకాశం 430, విజయనగరం 358, కృష్ణా 439, శ్రీకాకుళం 452 కేసులు నేడు నమోదు అయ్యాయి. ఇక గ‌డిచిన 24 గంటల్లో 97మంది కరోనాతో మ‌ర‌ణించారు.. కృష్ణా 4, చిత్తూరు 10, అనంతపురం 8, గుంటూరు 12, నెల్లూరు 4, పశ్చిమ గోదావరి 10, తూర్పుగోదావరి 6, కడప 8, ప్రకాశం 11, కర్నూలు 7, విశాఖ 6, శ్రీకాకుళం 8, విజయనగరం ముగ్గురు మృతి చెందారు. దీంతో ఎపిలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 2036 కి చేరింది.. ఇక ఈ రోజు 9097 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం ఎపిలో 85 వేల 112 మంది వివిధ హాస్ప‌టల్స్ లో చికిత్స పొందుతున్నారు.