ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్సనల్ లోన్ కావాలా..? వడ్డీ రేట్లు ఇవే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 09, 2020, 06:55 PM

ఈ కరోనా కాలంలో వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయని భయపడుతున్నారా? అయితే మీరు అలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు 14-20 శాతం వరకు ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు బాగా తగ్గాయి. 8.35 శాతం వడ్డీకే పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం బ్యాంకులు కల్పిస్తున్నాయి.వేర్వేరు బ్యాంకులు, కస్టమర్ల క్రెడిట్ స్కోర్‌ ఆధారంగా వడ్డీరేట్లు అమలు చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 9.60%-15.65%, కెనెరా బ్యాంక్- 8.50%-13.90%, సెంట్రల్ బ్యాంక్- 8.35%-10.20%, పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.80%-11.65%, బ్యాంక్ ఆఫ్ బరోడా- 10.10%-15.10%, ఐడీబీఐ బ్యాంక్- 8.90%-13.59%, ఇండియన్ బ్యాంక్- 9.20%-13.65%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 9.60%-12.05%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 9.70%1-0.70%, యూనియన్ బ్యాంక్- 9.30%-13.40% వరకు వడ్డీ రేట్లు అమలు చేస్తున్నాయి. మీ క్రెడిట్ స్కోర్ 750 నుంచి 800 మధ్య ఉంటే తక్కువ వడ్డీకే మీరు వ్యక్తిగత రుణాలు పొందవచ్చు. బ్యాంకులు సైతం అలాంటి కస్టమర్లను గుర్తించి ప్రీ-అప్రూవ్డ్ లోన్స్‌ను సైతం ఆఫర్ చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com