అర్చకులు ఏ సలహా ఇచ్చినా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం : టీటీడీ ఈవో సింఘాల్

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 09, 2020, 04:03 PM
 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు తమతో చర్చించలేదని చెప్పారు. అర్చకులు ఏ సలహా ఇచ్చినా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. కరోనా నయమైన అర్చకుల్లో చాలా మంది ఆలయ విధులకు హాజరవుతున్నారని, అయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్చకులకు తిరుమలలో విధులు ఇవ్వవద్దని ప్రధాన అర్చకులకు చెప్పామని ఈవో వెల్లడించారు. దర్శనాల కోసం అర్చకులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఆలోచన టీటీడీకి లేదని స్పష్టం చేశారు.


ఇక తిరుమల క్షేత్రంలో కరోనా గురించి చెబుతూ, ఇప్పటివరకు 743 మందికి కరోనా సోకినట్టు తేలిందని, వారిలో 400 మంది కోలుకున్నారని తెలిపారు. ఐదుగురు టీటీడీ ఉద్యోగులు కరోనా కారణంగా మరణించారని సింఘాల్ వివరించారు.