ఏపీలో రికార్డు కరోనా కేసులు, మరణాలు

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 09, 2020, 09:45 AM
 

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏపీ కరోనా బులెటిన్ వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 10080 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,17,040కి పెరిగింది. గత 24 గంటల్లో ఏపీలో 97 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఒక రోజు వ్యవధిలో ఇంత మంది చనిపోవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1939 కి చేరింది. గత 24 గంటల్లో 62123 కరోనా శాంపిల్స్ టెస్టు చేశారు. 9151 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా కరోనా మరణాలు చూసినట్లైతే.. గుంటూరు జిల్లాలో 14, అనంతపురం 11, కర్నూలు 10, పశ్చిమగోదావరి 10, చిత్తూరు 8, నెల్లూరు 8, ప్రకాశం 7, శ్రీకాకుళం 7, తూర్పుగోదావరి 6, విశాఖపట్నం 5, విజయనగరం 5, కృష్ణా 4, కడపలో ఇద్దరు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.