పెళ్లిపీటలెక్కబోతున్న టీమిండియా క్రికెటర్ చాహల్

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 08, 2020, 05:50 PM
 

టీమిండియా ఆటగాళ్లందరిలో బక్కపలుచగా కనిపిస్తూ, ఎంతో యాక్టివ్ గా ఉండే యువ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లికి ముందు జరిగే రోకా వేడుక పూర్తయిందని చాహల్ వెల్లడించాడు. "మా కుటుంబాలతో కలిసి మేం యస్ అనేశాం" అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా చహల్ తన కాబోయే జీవిత భాగస్వామితో కలిసివున్న ఫొటోను కూడా పంచుకున్నాడు.


ఇక చాహల్ పెళ్లాడబోయే అమ్మాయి పేరు ధనశ్రీ వర్మ. ఆమె ఓ డాక్టర్. అంతేకాదు, అనేక యూట్యూబ్ వీడియోలకు కొరియోగ్రాఫర్ గానూ వ్యవహరించింది. అయితే, కరోనా ప్రభావం కారణంగా ఇన్నాళ్లూ విశ్రాంతి తీసుకున్న చాహల్ త్వరలోనే ఐపీఎల్ ఆడేందుకు యూఏఈ వెళ్లాల్సి ఉంది. యూఏఈ వేదికగా ఐపీఎల్ సెప్టెంబరు 19 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో, పెళ్లి ముహూర్తం ఎప్పుడన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. ఐపీఎల్ పోటీలు నవంబరు 10న ముగియనున్నాయి.