విశాఖలో మరో ప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 08, 2020, 05:27 PM
 

ఇప్పటికే పలు వరుస ప్రమాదాలతో విశాఖ నగరం భయం గుప్పిట్లో ఉంది. తాజగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫిఫింగ్  ఆర్బర్ లో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి ఒడ్డుకు చేరుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో రూ. 50 లక్షల వరకు నష్టం జరిగి  ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓ ఫిషింగ్ బోటు ఈరోజు  చేపల వేట కోసం  ఓ ఫిషింగ్ బోటు సముద్రంలోకి వెళ్లింది. చేపల వేటను పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాదం గురించి పోర్టు అధికారులకు మత్స్యకారులు సమాచారం అందించారు.