ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తే హ్యాక్ అయినట్లే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 08, 2020, 05:21 PM

ఫోన్‌లో యాప్స్ ఓపెన్ అవ్వడం లేదా..? ఫోన్ స్లోగా ఉందా..? అయితే మీ ఫోన్ ప్రమాదంలో ఉన్నట్టే. జాగ్రత్త పడకపోతే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను హ్యాకర్లు టార్గెట్ చేసుకుంటున్నారు. మన వ్యక్తిగత బ్యాంకింగ్ డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా మాల్ వేర్, యూఆర్ఎల్స్ ద్వారా ఫోన్లకు ఎర వేస్తుంటారు. ఇలాంటి హ్యాకింగ్‌కు గురైనప్పుడు ఫోన్లు సరిగ్గా పనిచేయవు. అలాంటి చిన్న చిన్న సంకేతాలను గుర్తిస్తే ఫోన్లు హ్యాకింగ్ కాకుండా కాపాడుకోవచ్చు.
హ్యాకింగ్‌కు గురైనప్పుడు ఫోన్‌లో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. మీ స్మార్ట్ ఫోన్లలో తెలియని సోర్స్‌ల నుంచి రకరకాల యాడ్స్ వస్తాయి. ఈ యాడ్ల సంఖ్య పెరిగితే మీ ఫోన్ మాల్ వేర్‌ను కలిగి ఉన్నట్టు సంకేతం. అదేవిధంగా మనకు తెలియకుండా మన ఫోన్లలో యాప్స్ ఇన్ స్టాల్ అవుతుంటే హ్యాకింగ్ గురైనట్టే .
హ్యాకింగ్ గురైన ఫోన్లో యాప్ ఇన్‌స్టాల్ చేస్తై ఐకాన్ మాయమైపోతాయి. యాప్ డౌన్ లోడ్ చేసినప్పటికీ దానికి సంబంధించిన ఐకాన్ కనిపించదు. ఇటువంటి సందర్భాల్లో కూడా ఫోన్ హ్యాక్ అయిందని అనుకోవచ్చు. కొన్నిసార్లు ఫోన్ ఉపయోగించకపోయినా చార్జింగ్ అయిపోతుంది. ఇలా బ్యాటరీ వేగంగా డౌన్ అవుతుందంటే ఫోన్ హ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.
తెలియని నెంబర్ నుంచి ఇంటర్నేషనల్ కాల్స్ వస్తుంటే మీ ఫోన్ డేటా విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. మొబైల్ డేటా మీరుకు వాడకపోయినా వేగంగా అయిపోతుంటే ఆలోచించాల్సిందే. అన్ లిమిటెడ్ డేటా ప్యాక్స్ ఉన్నప్పటికీ.. మీ డైలీ డేటా పరిమితి అయిపోయినట్లయితే మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫోన్లలో యాప్స్ సడెన్‌గా ఆగిపోవడం, గూగుల్ ప్లే స్టోర్లో అప్‌డేట్ చేస్తున్నప్పుడు అప్‌డేట్ కాకపోవడం వంటి సమస్యలు వచ్చినా ఫోన్ హ్యాక్ అయిందనడానికి సంకేతమే. ఒకవేళ మీ ఫోన్ సడెన్ గా స్లో అయిపోయినా, అందులోని యాప్స్ స్లో అయినా కూడా మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయిందని చెప్పవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com