టాప్ 10 లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు...

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 08, 2020, 02:13 PM
 

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే 'మూవ్ ఆఫ్ ది నేషన్' పేరిట ఓ టెలిఫోన్ సర్వే నిర్వహించింది. అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులెవరంటూ చేపట్టిన ఈ సర్వేలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్-10లో నిలిచారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3వ స్థానంలో నిలవగా, తెలంగాణ సీఎం కేసీఆర్ 9వ స్థానం దక్కించుకున్నారు. ఈ సర్వేలో నెంబర్ వన్ గా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పట్టం కట్టారు. రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 4వ ర్యాంకు దక్కగా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే 7వ స్థానంలో ఉన్నారు.