ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శుభవార్త.. ఆగస్టు 12న కరోనా తొలి వాక్సిన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 08, 2020, 08:05 AM

ప్రపంచమంతా కరోనా వాక్సిన్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశం నుంచి ఆగస్టు 12న తొలి కరోనా టీకా విడుదల కానున్నట్లు ఆ దేశ ఉప ఆరోగ్య మంత్రి ఒలేగ్ గ్రిడ్నెవ్ తెలిపారు. టీకాను గమలేయ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్‌, రష్యా రక్షణ మంత్రిత్వశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయని వెల్లడించారు. గమలేయ ఇన్స్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ప్రస్తుతం చివరి దశ ట్రయల్స్‌లో ఉంది. ఈ దశ ట్రయల్స్ చాలా ముఖ్యమైనవని గ్రిడ్నెవ్ చెప్పారు.వైరస్‌ బారినపడిన వారిలో రోగ నిరోధక శక్తి పెరిగితే టీకా సురక్షితమని అర్థం చేసుకోవాలని ఒలేగ్ గ్రిడ్నెవ్ స్పష్టం చేశారు. తొలిదశలో వైద్య నిపుణులు, సీనియర్ సిటిజన్లకు టీకాలు వేయనున్నట్లు వెల్లడించారు. టీకా క్లినికల్ ట్రయల్స్ జూన్ 18న ప్రారంభమయ్యాయని, 38 మంది వాలంటీర్లకు టీకా ఇవ్వగా వారందరిలో రోగనిరోధక శక్తి పెరిగిందని వెల్లడించారు. రష్యా వాక్సీన్ సక్సెస్ అవుతుందా లేదా అన్న అంశంపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com