ఎమ్మిగనూరులో ఘనంగా చేనేత దినోత్సవ వేడుకలు

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 07:23 PM
 

ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక కుర్ని సేవచర సంఘం ఆధ్వర్యంలో కార్యాలయంలో ఘనంగా చేనేత దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్ట రంగయ్య, 6 వార్డు ఇంచార్జ్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారం లోకి వచ్చాక చేనేతలకు పెద్ద పీట వేశాడు. చేనేతలకు నేతన్న హస్తం, చేనేత పిన్షన్ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమా జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నారు అని తెలిపారు.అలాగే చేనేతలు ముడి సరుకు వంటివి తెచ్చుకోవడానికి ముద్ర లోన్ లు సైతం చేనేతలకు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు చేనేతలు అందరూ రుణపడి ఉంటాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చెర్మాన్ మాచని వెంకటేషప్ప, కె.శ్రీనివాసులు బి.ఎన్ నాగరాజు, బుడప్ప, గడిగే సుధాకర్, రామలింగప్ప, తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.