లాక్ డౌన్ వేళల్లో మార్పులు

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 07:21 PM
 

కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి లో లాక్ డౌన్ వేళల్లో మార్పులు చేసినట్లు ఎంపీడీవో సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. శనివారం, ఆదివారం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ఉంటుందన్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయి అన్నారు. గతంలో ఆరు గంటల నుండి 10 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉండేవి.ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. వెల్దుర్తి మండల టాస్క్ఫోర్స్ టీం అయిన తాసిల్దార్ రజిని కుమారి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డితో కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.