అదుపుతప్పి ఎద్దుల బండి బోల్తా.. రెండు ఎద్దులు మృతి

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 07:20 PM
 

అదుపుతప్పి ఎద్దుల బండి బోల్తా పది రెండు ఎద్దులు మృతి చెందాయి. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఆస్పరి మండలం బనవనూర్ గ్రామంలో గత నెలరోజులుగా వర్షాలు పడుతున్నాయి. మూడు రోజులు నుండి వర్షాపు నీరు నిలవడంతో రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి పొలానికి వెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.శుక్రవారం సాయంత్రం కాంతారెడ్డి రెడ్డి అనే రైతు పొలం పనులు చేసుకొని ఇంటికి వస్తుంటే ఎద్దుల బండి అదుపు తప్పి పక్కనే వున్న నీటి కుంటలో పడింది. ఈ ప్రమాదంలో ఎద్దులు రెండు మృతి చెందాయి. రైతు కూడా నీటి కుంటలో పడ్డాడు. రైతు కాలికి గాయాలయ్యాయి రైతుని గ్రామస్తులు కాపాడారు. ఎద్దులవిలువ రూ.1,20,000 విలువ ఉంటుందని తనకి నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతుని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.