టీఎంసీలో 125 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 07:17 PM
 

భారత ప్రభుత్వ పరిధిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌(టీఎంసీ)కి చెందిన ముంబయిలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 125 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల: 125


అసిస్టెంట్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌–01


నర్సు–115


క్లినికల్‌ కోఆర్డినేటర్‌ (న్యూరో సర్జరీ)– 01


సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–01


టెక్నీషియన్‌–06


అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌–01


అర్హత: పోస్టును బట్టి 12వ తరగతి/డిప్లొమా, బీఎస్సీ/ఎంఎస్సీ(నర్సింగ్‌), జీఎన్‌ఎం ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి.


వయసు: పోస్టులను బట్టి 25-40 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.


జీతం: పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీహెచ్‌సీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్లకు ఫీజు లేదు)


దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు12, 2020


పూర్తి వివరాలకు tmc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.