కాలువ కోసం పోరాడి.. అదే కాల్వలో పడి మృతి

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 07:07 PM
 

కర్నూలు జిల్లా డోన్ పట్టణ బంగారయ్యా కాలనీకి చెందిన హనోక్ నిన్న సాయంత్రం తన ఇంటి ముందు ఉన్న కాలువలో కాలుజారి పడ్డం వల్ల కాలువలో ఉన్న రాయి తలకు బలంగా తగలడం వల్ల ఫీట్స్ వచ్చి అయన మరణించారు. ఇదే కాలువ కోసం హనోక్ గత కొంత కాలంగా మునిసిపల్ ఆఫీస్ లో మరియు వీధీ సచివాలయంలో చాలా సార్లు కంప్లీట్ చేశారు కానీ అధికారులనుండి ఎటువంటి స్పందన లేదు. ఒక నెల క్రితం సచివాలయం శానిటేషన్ అసిస్టెంట్ వచ్చి చూసి వెళ్ళిపోయాడు.మళ్ళీ ఎటువంటి స్పందన లేదు. అపుడు అదికారులు పట్టించుకుని ఉంటే ఈ రోజు ఒక ప్రాణం నిలబడేది. చుట్టూ పక్కలవారు మాట్లాడుతూ.. మున్సిపల్ అధికారులు పన్నులు కోసం తిరిగి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తారు. కానీ మా ఆవేదనలు ఎవరు పట్టించుకోరు అని ఆవేదన వ్యక్తం చేశారు.