అధికార పార్టీ కనుసైగలలో నాడు-నేడు పనులు

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 07:06 PM
 

అధికార పార్టీ కనుసైగ లలో నాడు నేడు పనులు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని పి.డి.ఎస్.యు. జిల్లా ఉపాధ్యక్షుడు బి.మహేంద్ర బాబు, ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు విరేష్ యాదవ్ ఏపీ ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉసేని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు జిల్లా స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో సొగనూర్ రోడ్డు లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని నాడు నేడు పనులు మొదలు పెట్టడం జరిగింది కానీ అధికార పార్టీ నాయకులు తమ ప్రభుత్వం అంటూ స్కూల్ చైర్మన్, హెడ్ మాస్టర్, ఏఈ, ఆధ్వర్యంలో నాడు నేడు పనులు జరగాలి కానీ అధికార పార్టీ నాయకులు వాళ్ల ఆధీనంలో నాసిరకం అయినటువంటి వస్తువులను వాడుతూ కమిషన్ల కొరకు విద్యార్థి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా నాడు నేడు పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని అలాంటి వారి కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తే నాసిరకమైనటువంటి వస్తువులు మొదలైన వాటిని వాడుతూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి స్కూల్ లో నాడు నేడు పనులకు అధికార పార్టీకి ఎటువంటి సంబంధం లేకుండా స్కూల్ చైర్మన్ హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో పనులు నిర్వహించాలని వాళ్లను భయభ్రాంతులకు గురి చేయకూడదని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.