జాతీయ ప్రధాన కార్యదర్శి కి ఘన స్వాగతం

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 07:01 PM
 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మాలమహానాడు ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం శుక్రవారం ఉదయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాల నరసన్న, మురళీకృష్ణ, రవిచంద్ర మాట్లాడుతూ.. 8వ తేదీన ఉదయం( పది )గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు మరియు జాతీయ మాలమహానాడు ప్రధాన కార్యదర్శి కేసి కుసుమ కుమారి మొట్టమొదటిసారిగా ఎమ్మిగనూరు పట్టణముకు రానున్న శుభ సందర్భంగా స్వాగతం పలుకుతూ.. మాలమహానాడు స్వాగతమిస్తుందని వారు లోకల్ న్యూస్ మూకంగా తెలిపారు.అలాగే దళితుల మహిళల పట్ల అవగాహన, వారి రక్షణకై మాలల కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న, తాలూకా అధ్యక్షుడు మురళీకృష్ణ, రవిచంద్ర, నందవరం పంపయ్య, తదితరులు పాల్గొన్నారు.