పోలీసు వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేయాలి

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 06:53 PM
 

రెండు నెలలపాటు స్వచ్ఛందంగా కోవిడ్ విధులను నిర్వహించిన పోలీసు వాలంటీర్లకు ఆగస్టు 15న జరిగే కార్యక్రమంలో ప్రశంసా పత్రాలను అందించి తగిన రీతిన సన్మానించాలని పోలీసు వాలంటీర్ల కోఆర్డినేటర్ మాజీ కార్పొరేటర్ జి సురేంద్ర శుక్రవారం కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు .మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలలో పోలీసుల, జిల్లా అధికారుల తోపాటు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా వాలంటీర్ల డ్యూటీ నిర్వహించారు.అలాగే నగరంలోని దాతల సహకారంతోను నిత్యావసర సరుకులను, టి.జి.వి గ్రూప్ సంస్థ చే టీ షర్టులను అందజేశామని సురేంద్ర వివరించారు. మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 41 మంది పోలీసు వాలంటీర్లు డ్యూటీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఆదేశిస్తే పోలీసు వాలాంటీర్లచే అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సురేంద్ర తెలిపారు.