రెహానా ఫాతిమాకు ముందస్తు బెయిల్ మంజూరు నిరాకరించిన సుప్రీంకోర్టు...

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 06:53 PM
 

సామాజిక ఉద్యమకారిణి రెహానా ఫాతిమాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అర్ధనగ్న శరీరంపై తన పిల్లల చేత బొమ్మలు వేయించుకున్న కేసులో బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. ఇలాంటి కేసు రావడం వల్ల కొంచెం కంగారు పడ్డామని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలాంటి వీడియోలను చూడటం వల్ల మన దేశ సంస్కృతిపై పిల్లలు ఎలాంటి భావాన్ని ఏర్పరుచుకుంటారని ప్రశ్నించింది. ఇలాంటి ఆలోచనలు రావడమే దారుణమని చెప్పింది. ఆమె ఉద్యమకారిణి కావచ్చని... అయినప్పటికీ ఇలాంటి వాటిని అనుమతించలేమని తెలిపింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.