ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిట్‌శాట్ 2020 పరీక్ష కొత్త తేదీలు ఇవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 05, 2020, 07:35 PM

దేశంలో ప్ర‌తిష్ఠాత్మ‌క ఇంజినీరింగ్ విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సైన్స్ (బిట్స్)లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే బిట్‌శాట్‌-2020 పరీక్ష తేదీల‌ను బిట్స్ పిలానీ ప్ర‌క‌టించింది.


బిట్‌శాట్‌ పరీక్ష విధానం:


ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఈ టెస్ట్‌ ద్వారా పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో బీఈ/బీటెక్‌, బీఫార్మా ప్రవేశాలు కల్పిస్తారు.


ఎవరు అర్హులు..?


ఇంటర్‌ ఎంపీసీ/బైపీసీలో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులు. ఇంటర్‌ స్టేట్‌ టాపర్లకు నేరుగా ప్రవేశం కల్పిస్తారు.


అందించే కోర్సులు:


బీఈ (సివిల్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఈఈఈ, ఈసీఈ, ఈఐ, మెకానికల్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, బయోటెక్నాలజీ, బీఫార్మా కోర్సులతో పాటు ఎమ్మెస్సీ కోర్సులను కూడా బిట్స్‌ అందిస్తుంది.


పరీక్ష విధానం:


ఇది మూడు గంటల పరీక్ష. కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు.


మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ప్రశ్నలు ఇస్తారు.


మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.


పరీక్ష తేదీలు: సెప్టెంబ‌ర్ 16 నుంచి 18 వ‌ర‌కు, సెప్టెంబ‌ర్ 21 నుంచి 23 వ‌ర‌కు జరుగుతాయి.


పూర్తి వివ‌రాలు అధికారిక వెబ్‌సైట్‌ www.bitsadmission.com/లో చూడొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com