ఏపీ మహిళలకు శుభవార్త..

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 05:24 PM
 

ఏపీ సర్కార్ మహిళల కోసం మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ-రక్షాబంధన్ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ-రక్షాబంధన్ కు సంబంధించిన లోగోను సీఎం జగన్ ఆవిష్కరించారు. సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. దీని ద్వారా సైబర్ నేరాలు,రక్షణ చర్యలు అనే దాని పై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.