తెదేపా నాయకులపై కక్ష సాధింపుతోనే ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయాలు: మాజీ మంత్రి

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 04:21 PM
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెదేపా నాయకులపై కక్ష సాధింపుతోనే ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమ వేదిక ద్వారా ఆమె ఆదివారం మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ సెక్రటేరియట్‌, రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైందన్నారు.